కీచక టీచర్: విద్యార్థినిలను తాకరాని చోట తాకుతూ లైంగిక వేధింపులు

by Disha Web Desk 21 |
కీచక టీచర్: విద్యార్థినిలను తాకరాని చోట తాకుతూ లైంగిక వేధింపులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : చిన్నారులకు స్కూల్స్‌లో కూడా భద్రత కరువు అవుతుంది. కొందరు ఉపాధ్యాయులు కామాంధులుగా మారి విద్యార్థులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటన ఒకటి అనంతపురం జిల్లా కేంద్రీయ విశ్వవిద్యాలయం స్కూల్లో వెలుగులోకి వచ్చింది. కేంద్రీయ విశ్వవిద్యాలయం స్కూల్‌లో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థినులను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనను చితకబాదారు. లైబ్రేరియన్ విద్యార్థినులను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్ధినిల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లైబ్రేరీకి వెళ్లిన విద్యార్థినిలను దగ్గరకు పిలిపించుకుని లోపల వేసుకున్న లో దుస్తుల కలర్ ఏంటో చెప్పాలని అడుగుతున్నాడని అంతేకాకుండా మసాజ్ చెప్పాలని వేధిస్తున్నాడని విద్యార్థినులు తల్లిదండ్రుల వద్ద వాపోయారు. లైబ్రేరీకి వెళ్లాలంటేనే భయం వేస్తుందని విద్యార్థినిలు తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా కలిసి సోమవారం స్కూల్ వద్దకు చేరుకున్నారు. లైబ్రేరియన్‌ను చితక బాదారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.విద్యార్థుల తల్లిదండ్రుల చేతుల్లో దెబ్బలు తింటున్న లైబ్రేరియన్‌ను పోలీసులు రక్షించి స్టేషన్‌కు తరలించారు. అయితే తాను ఎవరినీ వేధించలేదని లైబ్రేరియన్ చెప్తున్నారు. తనపై గత ప్రిన్సిపాల్ ఇలాంటి అలిగేషన్స్ చేయిస్తున్నాడని ఆరోపించారు. అయితే పోలీసుల విచారణ అసలు జరిగిందేంటో తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed