- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబు మార్క్ సుపరిపాలన: 45 రోజుల మహా ప్రజా ప్రచారంలో టీడీపీ
కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున 45 రోజుల 'ఇంటింటి ప్రచార కార్యక్రమం'

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేత్రుత్వంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా రెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ (TDP) కీలక నిర్ణయం తీసుకుంది. సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున 45 రోజుల 'ఇంటింటి ప్రచార కార్యక్రమం' ('Door-to-door campaign') ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులు, నాయకులు అత్యంత ఉత్సాహంగా ఈ ప్రచారంలో పాల్గొంటున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతి ప్రాంతంలోనూ ప్రజా ప్రతినిధులు నేరుగా ప్రజల వద్దకు వెళుతూ వారితో మమేకమవుతున్నారు.
ఈ మహా ప్రజా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో పాటు వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లక్షలాది మంది కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పాల్గొంటున్నారు. గత రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అందించిన సుపరిపాలన విజయాలను ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పిస్తూ, వారి నుంచి విశేష స్పందనను రాబడుతున్నారు.
ఈ పర్యటనల ద్వారా ప్రజా ప్రతినిధులు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా, ప్రజల అభిప్రాయాలు, సూచనలు, స్థానిక సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం, ప్రజల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు. ప్రతి ఇంటినీ పలకరించి, వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ ముందుకు సాగుతున్న ఈ ప్రచార కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అపారమైన మద్దతు, హర్షం వ్యక్తమవుతున్నాయి.






