ఒంటిమిట్టలోనూ TDP విజయం

by Gantepaka Srikanth |

వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంటిమిట్ట(Vontimitta) జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ తెలుగు దేశం పార్టీ(TDP) విజయం సాధించింది.

ఒంటిమిట్టలోనూ TDP విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంటిమిట్ట(Vontimitta) జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ తెలుగు దేశం పార్టీ(TDP) విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిపై టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డి గెలుపొందారు. ఇదిలా ఉంటే.. పులివెందుల, ఒంటిమిట్ల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో దొంట ఓట్లతో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల లెక్కింపుపై చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. గురువారం ఆయన పులివెందులలో మీడియాతో మాట్లాడారు. దొంగ ఓటింగ్‌తో, ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు రానివ్వకుండా చేసుకున్న ఈ ఎన్నికలను అసలు ఎన్నికలు అని ఎలా అంటారని ప్రశ్నించారు. తమ అరాచకాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు, స్వేచ్ఛగా ఎన్నికలు జరిగాయి అని మభ్యపెట్టేందుకే ఎల్లో మీడియా ద్వారా ఇటువంటి దిగజారుడు రాతలు రాయించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story