Tdp: అనూహ్య విజయంతో టీడీపీలో నూతనోత్సాహం

by Disha Web Desk 16 |
Tdp: అనూహ్య విజయంతో టీడీపీలో నూతనోత్సాహం
X

దిశ, వెబ్ డెస్క్: వరుస విజయాలతో టీడీపీలో నూతనోత్సాహం వెల్లివెరిసింది. నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నేడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తే.... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ అనూహ్యంగా షాక్ ఇచ్చింది. 7 ఎమ్మెల్సీ స్థానాల్లో సరైన బలం లేకపోయినా చంద్రబాబు మైండ్ గేమ్‌తో టీడీపీ అభ్యర్థిని ఒక స్థానంలో గెలుపించుకోగలిగారు. క్రాస్ ఓటింగ్‌పై సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు మాత్రం బెడిసి కొట్టాయి. వైసీపీ నుంచి అదనంగా రెండు ఓట్లు టీడీపీకి వెళ్లాయి.


ఎన్నికల కంటే ముందే ఆనం, కోటంరెడ్డి ఓట్లు పక్కాగా టీడీపీకే వెళ్తాయని తెలుసు. కానీ అనూహ్యంగా మరో రెండు ఓట్లు కూడా తోడుకావడంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం ఈజీ అయింది. దీంతో టీడీపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. అటు పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఈ విజయాన్ని ఆశ్వాదించారు. కేక్ కట్ చేసి పార్టీ నేతలకు తినిపించారు. భవిష్యత్‌లో కూడా ఇలానే పని చేసి విజయాలు సాధించాలని సూచించారు. అటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ టీడీపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకుంటున్నారు.

Also Read...

పవన్‌కు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంది: జ్యోతిష్యులు



Next Story

Most Viewed