- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP News : విశాఖలో టీడీపీ vs జనసేన
విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ(TDP), జనసేన పార్టీ (JSP) మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం(Vishakhapatnam)లో తెలుగుదేశం పార్టీ(TDP), జనసేన పార్టీ (JSP) మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఇటీవల మంత్రి నారా లోకేష్(Nara Lokesh) నాయకత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలోనే ఈ గొడవలు జరిగినట్టు సమాచారం. విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్(MLA Vamshi Krishna Yadav), గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(GVMC) అధికారుల పోస్టింగ్‌లలో తమ సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని, TDP ఇన్‌చార్జ్‌ల పెత్తనం తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనికి TDP ఇన్‌చార్జ్‌లు గండి బాబ్జీ, పి.వి.ఎల్. నరసింహరాజు అలియాస్ నాగేశ్వరరాజు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే తమ పాత్ర ఏమిటని సమావేశంలోనే ప్రశ్నించారు. ఒక దశలో నాగేశ్వరరాజు మరియు ఎమ్మెల్యే వంశీ కృష్ణకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జోక్యం చేసుకొని.. కూటమి ప్రభుత్వంలో ఎన్నికైన ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఉంటుందని, ఇన్‌చార్జ్‌లు సహకరించాలని స్పష్టం చేశారు. దీనితో TDP నాయకులలో మరింత అసంతృప్తి పెరిగినట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికలలో TDP-జనసేన-BJP కూటమి విజయం సాధించినప్పటికీ.. విశాఖలో అధికారంపై పట్టు, స్థానిక పదవుల నియామకాలపై రెండు పార్టీల మధ్య ఉద్రిక్తతలను ఈ తాజాగా వివాదం బట్టబయలు చేసింది. గతంలో GVMC డిప్యూటీ మేయర్ పదవి కోసం కూడా ఇరు పార్టీల మధ్య ఇదివరకే వివాదం జరిగిన సంగతి తెలిసిందే.






