- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TDP: ఏనుగుల దాడిలో టీడీపీ నేత మృతి.. మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి
పార్టీ పటిష్టత కోసం పని చేసిన వ్యక్తి మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: పార్టీ పటిష్టత కోసం పని చేసిన వ్యక్తి మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అన్నారు. ఏనుగుల దాడిలో ఉపసర్పంచ్ మృతి చెందడం పట్ల మంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా లోకేష్.. ఏనుగుల దాడిలో తిరుపతి జిల్లా(Tirupati District) చంద్రగిరి మండలం(Chandragiri Mandalam), కందులవారిపల్లె(Kandulavaripalle) ఉపసర్పంచ్ రాకేష్ చౌదరి(Rakesh Choudary) మృతిచెందడం బాధాకరమని అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. చిన్నరామాపురం, కొంగరవారిపల్లెలో ఏనుగులు సంచరిస్తున్నాయనే సమాచారంతో వాటిని తరిమేందుకు వెళ్లిన రాకేష్ పై ఏనుగులు దాడిచేయడంతో ఆయన మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో నిత్యం చురుగ్గా ఉండే రాకేష్.. పార్టీ పటిష్టత కోసం కృషిచేశారని కీర్తించారు. రాకేష్ చౌదరి మృతి పార్టీకి తీరని లోటు అని, వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంతేగాక వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఎక్స్ లో నారా లోకేష్ రాసుకొచ్చారు.






