చేరికలపై టీడీపీ కీలక నిర్ణయం..కండిషన్స్ అప్లై

by Ajay Maddhiboyina |

పార్టీలో చేరికలపై తెలుగుదేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్టీలో చేరాలి అంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.

చేరికలపై టీడీపీ కీలక నిర్ణయం..కండిషన్స్ అప్లై
X

దిశ, వెబ్ డెస్క్: పార్టీలో చేరికలపై తెలుగుదేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్టీలో చేరాలి అంటే హైకమాండ్ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఉత్వర్వులు జారీ చేశారు. ఇతర పార్టీల నేతలను టీడీపీలో చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఒకవేళ ఎవరైనా టీడీపీలో చేరాలి అనుకుంటే వారి వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపించాలని స్పష్టం చేశారు. ఎంక్వైరీ చేసి ఆ తరవాత అనుమతి ఇచ్చిన తరవాత వారిని పార్టీలో చేర్చుకోవాలని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు చంద్రబాబు ఇచ్చారని ప్రతి ఒక్కరూ పాటించాలని స్పష్టం చేశారు. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు అందరూ ఇది గమనించాలని పేర్కొన్నారు.

Next Story