జగన్ నుంచే ఎమ్మెల్సీ బొత్సకు ప్రాణహాని: పల్లా శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-10-11 13:10:10  IST  )

జగన్‌ నుంచే ఎమ్మెల్సీ బొత్సకు ప్రాణహాని ఉండొచ్చని టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

జగన్ నుంచే ఎమ్మెల్సీ బొత్సకు ప్రాణహాని: పల్లా శ్రీనివాస్‌ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్‌(Ys Jagan) నుంచే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(MLC Botsa Satyanarayana)కు ప్రాణహాని ఉండొచ్చని టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(Palla Srinivasarao) అనుమానం వ్యక్తం చేశారు. పైడితల్లి సిరిమానోత్సవంలో వేదిక కూలిన ఘటనలో తనకు అధికార పార్టీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బొత్సకు కూటమి నుంచి ఎలాంటి ప్రాణహాని లేదని తెలిపారు. కాకపోతే సొంత పార్టీ నుంచే ప్రాణహాని ఉండొచ్చన్నారు. ఈ విషయాన్ని బొత్స చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. మండలిలో బొత్స కొంత రాణించే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే జగన్‌ నుంచే ప్రాణ హాని ఉంటుందోమోనన్నారు. బొత్స రక్షణ కోరితే CM చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Next Story