- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లండి: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పల్లా పిలుపు
ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర అసెంబ్లీ(Assembly)లో 2026-27 వార్షిక బడ్జెట్(Annual budget)ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మొత్తం వివిధ అవసరాలకు రూ. 3.32 లక్షల కోట్లకుపైగానే కేటాయింపులు జరిపింది. అయితే ఈ బడ్జెట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు(TDP state president Palla Srinivasa Rao) కీలక దిశానిర్దేశం చేశారు. బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బడ్జెట్‌లో జరిపిన కేటాయింపులను అంశాల వారీగా వివరించాలని చెప్పారు. జగన్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిన రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకొచ్చే దిశగా ఈ బడ్జెట్ ఉందని ప్రజలకు చెప్పాలని పల్లా తెలిపారు. అభివృద్ధి-సంక్షేమం- సంపద సృష్టించేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతోందన్నారు. విజన్ 2047 లక్ష్యాన్ని రూపొందించేలా ఈ బడ్జెట్‌ను రూపొందించారని టీడీపీ రాష్ట్ర పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.






