నారా లోకేష్‌కు డిప్యూటీ CM.. సొంత నేతలకు షాకిచ్చేలా TDP సీనియర్ లీడర్ షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |

నారా లోకేష్‌(Nara Lokesh)కు డిప్యూటీ సీఎం(Deputy CM) ఇవ్వాలని టీడీపీ(TDP) శ్రేణులు చేస్తున్న డిమాండ్‌ గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది.

నారా లోకేష్‌కు డిప్యూటీ CM.. సొంత నేతలకు షాకిచ్చేలా TDP సీనియర్ లీడర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: నారా లోకేష్‌(Nara Lokesh)కు డిప్యూటీ సీఎం(Deputy CM) ఇవ్వాలని టీడీపీ(TDP) శ్రేణులు చేస్తున్న డిమాండ్‌ గతకొన్ని రోజులుగా రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఏడాది కూడా కాకముందే అనూహ్యంగా ఈ డిమాండ్‌ తెరమీదకు రావడంతో ఇటు టీడీపీ అధిష్టానంతో పాటు అటు జనసేన అధిష్టానం కూడా స్పందించింది. ఎవరికి వారు తమ తమ అభిప్రాయాల్ని మీడియా ఎదుట, సోషల్ మీడియాలో చెప్పడానికి వీళ్లేదని హెచ్చరించింది. ఏ నిర్ణయమైనా కూటమి పెద్దలు మాట్లాడుకున్న తర్వాతే తీసుకుంటామని స్పష్టం చేశారు. తాజాగా.. ఈ అంశంపై టీడీపీ సీనియర్ లీడర్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Gorantla Butchaiah Chowdary) స్పందించారు. లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని అడగటం కరెక్ట్ కాదని పార్టీ శ్రేణులకు చురకలు అంటించారు.


ఆల్రేడీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన నేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉన్నారని గుర్తుచేశారు. పార్టీ కోసం లోకేష్ ఎంతో కష్టపడి పనిచేశారని.. అందులో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదని అన్నారు. అందుకు తగ్గట్టుగా పార్టీ కూడా లోకేష్‌కు సముచిత స్థానాన్నే కల్పించిందని గుర్తుచేశారు. ఈ అంశంపై పదే పదే మాట్లాడితే లోకేష్‌ను తగ్గించిన వాళ్లం అవుతామని.. దయచేసి ఎవరూ మరోసారి ఈ డిమాండ్‌ చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) రాజీనామా అంశం మీదా బుచ్చయ్య చౌదరి స్పందించారు. అవినీతి అక్రమాలకు పాల్పడిన వారికి ఎవడైనా సరే శిక్షలు తప్పవని, అక్రమాలకు పాల్పడి.. అధికారం పోయిన తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరడం సరైంది కాదన్నారు. అలాగే అధికారం ఉంది కదా అని మనం కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని గోరంట్ల హెచ్చరించారు.

విజయసాయి విశాఖపట్నంలో దోపిడీ చేశారని, కాకినాడ పోర్టును అల్లుడుకు దోచిపెట్టాడని, విశాఖలో లక్షల కోట్లు దోచేశారని.. అవన్నీ కూడా తిరిగి బాధితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ రాబోయే రోజుల్లో కనుమరుగవుతుందని, ఆ పార్టీలో అందరూ సర్దుకుంటారన్నారు. అక్రమాలు, అవినీతి లేని నాయకులు వస్తే అధిష్టానం ఆలోచిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ‘రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.. ఇక వ్యవసాయం చేసుకుంటానని.. చంద్రబాబుతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని.. పవన్‌ కల్యాణ్‌ తనకు చిరకాల మిత్రుడు. ఇక నేను వ్యవసాయంపై దృష్టి పెడతాను’ అని విజయసాయిరెడ్డి ప్రకటించారు.

Next Story