మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం.. 20 తీర్మానాలపై చర్చ

by Naga Rani Yarlagadda |

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే.. వార్షిక పండుగ మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు, కసరత్తులపై చర్చించేందుకు తీర్మానాల కమిటీ సమావేశమయింది.

మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం.. 20 తీర్మానాలపై చర్చ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే.. వార్షిక పండుగ మహానాడుకు సంబంధించిన ఏర్పాట్లు, కసరత్తులపై చర్చించేందుకు తీర్మానాల కమిటీ సమావేశమయింది. రెండ్రోజులపాటు జరగనున్న మహానాడు సభల్లో రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ పరిణామాలపై దాదాపు 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ క్రమంలో మహానాడులో ప్రవేశపెట్టాల్సిన అంశాలపై చర్చించేందుకు టీడీపీ కేంద్ర కార్యాలయం 'ఎన్టీఆర్ భవన్'లో తీర్మానాల కమిటీ బుధవారం ప్రత్యేకంగా సమావేశమైంది. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలతో పాటు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రతిబింబించేలా ఈ తీర్మానాల రూపకల్పన జరుగుతోంది. ఈ సమావేశంలో ఉమ్మడి తీర్మానాలతో పాటు సమకాలీన అంశాలపై విస్తృతంగా చర్చించారు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు (NTR) జన్మదిన వేడుకలు, పార్టీ సంస్థాగత బలోపేతం, యువతకు రాజకీయంగా పెద్దపీట వేయడంపై చర్చించారు. తెలంగాణ నుంచి కూడా నాలుగు అంశాలను తీర్మానంలో చేర్చేందుకు యోచిస్తున్నారు. రేపు మరోసారి తీర్మానాల కమిటీ సమావేశం కానుంది.

Next Story