సీఎం అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం..

by Naga Rani Yarlagadda |

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వర్చువల్ గా పొలిట్ బ్యూరో సమావేశమయింది.

సీఎం అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం..
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వర్చువల్ గా పొలిట్ బ్యూరో సమావేశమయింది. పొదుపు చర్యల్లో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవ్వగా.. పాలనా విజయాలను నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా రూపొందించాల్సిన కార్యాచరణపై చర్చించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఆదేశించారు. అలాగే ఈ ఏడాది హైబ్రీడ్ విధానంలో మహానాడు నిర్వహణ, పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం వల్ల తలెత్తుతున్న ఆర్ధిక ఇబ్బందులు తదితర అంశాలపై కూడా సీఎం చంద్రబాబు పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించారు.

Next Story