- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం.. మహిళలకు ఫ్రీ బస్ పై కీలక నిర్ణయం
పోలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు. మహానాడు (Mahanadu)లోపు పార్టీలోని అన్ని విభాగాల కమిటీలను భర్తీ చేయాలని పోలిట్ బ్యూరో నిర్ణయించినట్లు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu)అధ్యక్షతన జరిగి టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించదలచిన మినీ మహానాడుకు సంబంధించిన విషయాలను ఈ సమావేశంలో చర్చించారు. పోలిట్ బ్యూరో సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను మంత్రి అచ్చెన్నాయుడు మీడియాకు వెల్లడించారు. మహానాడు (Mahanadu)లోపు పార్టీలోని అన్ని విభాగాల కమిటీలను భర్తీ చేయాలని పోలిట్ బ్యూరో నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే పద్మభూషణ్ గ్రహీత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)ను అభినందిస్తూ తీర్మానం చేసిందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడుల్లో మరణించిన వారికి సంతాపంగా ప్రతి నియోజకవర్గంలో ఈనెల 16,17,18 తేదీల్లో తిరంగా యాత్రలు చేపట్టాలని పోలిట్ బ్యూరో నిర్ణయించిందని వివరించారు. జనసేన, బీజేపీలతో కలిసి ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.
పార్టీలో ఒకే పదవిలో 3 సార్లు కంటే ఎక్కువ ఉండకూడదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీసుకొచ్చిన ప్రతిపాదనపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు అచ్చెన్న చెప్పారు. మూడు పర్యాయాలు, ఆరేళ్లుగా ఉన్న మండల పార్టీ అధ్యక్షుల్ని మార్చాలని నిర్ణయించామన్నారు. వారికి ఆ పై స్థాయి పదవి లేదా సమాంతర పదవి ఇవ్వాలని తీర్మానించామన్నారు. లబ్ధిదారులకు ప్రతినెలా సంక్షేమ పథకాలు అందేలా ఏడాది క్యాలెండర్ ను రూపొందించాలని పోలిట్ బ్యూరో నిర్ణయించిందని అచ్చెన్న తెలిపారు.
ఇక దీపం పథకం (Deepam Scheme) నగదు చెల్లింపులు ముందుగానే జరుగుతాయన్నారు. సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయించామని, ఒక ఏడాదిలో 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లిస్తామని తెలిపారు. సిలిండర్ బుక్ చేసుకున్నా, తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదును ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలో వేసేలా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇక జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తికానున్న సందర్భంగా లక్ష మంది ఒంటరి మహిళలు, వితంతువులకు గత ప్రభుత్వం ఆపేసిన పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. తల్లికి వందనం (Talliki Vandanam), అన్నదాత సుఖీభవ పథకాలు కూడా ఆరోజునే ప్రారంభిస్తామని, ఇక మహిళలకు ఉచిత బస్సు (AP Free Bus Scheme) ప్రయాణాన్ని రెండు నెలల్లో ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.






