- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎమర్జెన్సీ సమావేశం.. ఎంపీలకు కీలక సూచనలు
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు...

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrabau Naidu) అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం(Tdp Parlament Party Meeting) నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం నిర్దేశం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, ఆర్థిక సహాయంపై చర్చించారు. పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి(Amaravati) చట్టబద్ధతపై బిల్లు పెట్టే చాన్స్ ఉందని ఉందన్న నేపథ్యంలో ఎంపీలకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పోలవరం నిధులపైనా చర్చించారు. అమరావతికి ఇప్పటికే రూ. 15 వేల కోట్ల నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే తరహా సాయం చేయాలని పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని కోరాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, హైవేలు, ఇతర అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాలని ఎంపీలకు సీఎం చంద్రబాబు తెలిపారు.
28 నుంచి పార్లమెంట్ సమావేశాలు
కాగా ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు (Budget sessions of Parliament)ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నాయి. ఈ బడ్జెట్‌లో ఏపీ(Ap)కి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ కోరుతోంది. ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.






