కేంద్ర మంత్రి ఖట్టర్‌తో టీడీపీ ఎంపీలు.. మరో కీలక విజ్ఞప్తి

by Kema Shiva Kumar |

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.

కేంద్ర మంత్రి ఖట్టర్‌తో టీడీపీ ఎంపీలు.. మరో కీలక విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఘటనపై విపక్షాలు చర్చకు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే సభను స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) పలుమార్లు వాయిదా వేశారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ (Manohar Lal Khattar)ను పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్‌లో టీడీపీ (TDP) ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ పార్టీగా ఉన్న టీడీపీకి ఢిల్లీ (Delhi)లో పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. అందుకు కేంద్ర మంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించి విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఖట్టర్‌ను కలిసిన వారిలో టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కలిశెట్టి అప్పల నాయుడు, శ్రీభరత్, జీ.ఎం.హరీష్ బాలయోగి, పుట్టా మహేష్ కుమార్, కేసినేని శివనాథ్ (చిన్ని), పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణ దేవరాయలు, తెన్నేటి కృష్ణప్రసాద్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బైరెడ్డి షబరి, బస్తిపాటి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ ఉన్నారు.

Next Story