ఎంపీలు సైకిళ్లను ఉపయోగించాలి.. సైకిల్‌పై పార్లమెంట్‌కు టీడీపీ ఎంపీ

by Ramesh Naini |

గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే.

ఎంపీలు సైకిళ్లను ఉపయోగించాలి.. సైకిల్‌పై పార్లమెంట్‌కు టీడీపీ ఎంపీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఎంపీ చేసిన వినూత్న అవగాహన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా టీడీపీ ఎంపీ అప్పలనాయుడు కలిశెట్టి కాలుష్యంపై అవగాహన కల్పించేందుకు సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు. సోమవారం పార్లమెంట్‌కు టీడపీ నేత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్‌పై వచ్చారు. తలకు హెల్మెట్, మాస్క్ ధరించిన ఆయన.. సైకిల్‌ను పార్లమెంట్‌ ఆవరణలో సైకిల్ పార్క్ చేయడం చూసిన అందరూ అశ్చర్యానికి గురయ్యారు. దీనిపై మీడియా ప్రశ్నించగా టీడీపీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కాలుష్యం అవగాహన కల్పించేందుకు సైకిల్ తొక్కుకుంటూ వచ్చినట్లు తెలిపారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఎంపీలు కూడా సైకిళ్లను ఉపయోగించాలని ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండడంతో.. ఈ సమస్యపై పార్లమెంట్‌లో చర్చ జరపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా, కేంద్ర ప్రభుత్వం అందుకు సమ్మతించింది. వీడియో ఇదే..

Next Story