ఏపీ అభివృద్ధికి 2025 బలమైన పునాది: ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు

by Vemula.Srinu Prasad |

ఏపీ ప్రజలకు టీడీపీ ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..

ఏపీ అభివృద్ధికి 2025 బలమైన పునాది: ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు
X

దిశ, చిత్తూరు: 2025 సంవత్సరం ఏపీ అభివృద్ధి పథంలో ఒక మైలురాయిగా నిలిచిందని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రం రూపుదిద్దుకోవడానికి బలమైన పునాది వేసిందని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన 'విజన్ 2047' సాకారం దిశగా ఈ ఏడాది కీలక అడుగులు పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీ నిధుల నుంచి సుమారు రూ.5 కోట్లు, నరేగా కింద రూ.7 కోట్లు నిధులతో సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనాలు, గోకులం షెడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చిత్తూరు కేంద్రంగా ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులు నిర్వహించి యువతను ప్రోత్సహించామన్నారు. పాకాల రైల్వే డిపో ఏర్పాటు, చిత్తూరు-కాట్పాడి డబుల్ ట్రాక్ పనులు, కుప్పం-కాణిపాకం మీదుగా బెంగళూరుకు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం వద్ద చొరవ తీసుకున్నట్లు తెలిపారు.

కేంద్రం దృష్టికి ప్రత్యేక మ్యాంగో బోర్డు ప్రతిపాదన

చిత్తూరు మామిడి రైతుల ప్రయోజనార్థం ప్రత్యేక మ్యాంగో బోర్డు సాధన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. కుప్పం, చిత్తూరులో కేంద్రీయ విద్యాలయాల స్థాపనకు ఆమోదం లభించిందని... అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు 50 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు 2026లో మరిన్ని సంస్కరణలు చేపడతామని, ప్రజలందరికీ ఈ కొత్త ఏడాది సుఖసంతోషాలను చేకూర్చాలని ఎంపీ ఆకాంక్షించారు.

Next Story