- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు టీడీపీ అభ్యర్థులు ఖరారు అయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో(MLA quota in MLC elections) టీడీపీ అభ్యర్థులు(TDP candidate) ఖరారు అయ్యారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు అభ్యర్థులను తాజాగా ఆ పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కావలి గ్రీష్మ(Kavali Greeshma), బీద రవిచంద్ర(Bidha Ravichandra), బీటీ నాయుడు(BT Naidu)ను ఖరారు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధికారికంగా లిస్టు విడుదల చేసింది. సామాజిక వర్గాల వారీగా ముగ్గురు నాయకులకు అవకాశం కల్పించింది. ఎస్సీ మాల సామాజిక వర్గం నాయకురాలు, మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ కాగా, యాదవ సామాజిక వర్గానికి చెందిన నేత బీద రవిచంద్రతో పాటు బోయ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు బీటీ నాయుడును తమ అభ్యర్థులుగా టీడీపీ అధిష్టానం వెల్లడించింది.
అయితే ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో జనసేన నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే మరో ఎమ్మెల్సీ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానాన్ని బీజేపీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదని సమాచారం. మరి ఏం జరుగుతోందో చూడాలి.
READ MORE ...
Ap Elections: ఏ క్షణమైనా టీడీపీ అభ్యర్థుల జాబితా విడుదల..?






