- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయసాయిరెడ్డిని వదలను.. జైలుకు పంపుతా: TDP Mlc
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని జైలుకు పంపే వరకూ వదలిపెట్టనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నహెచ్చరించారు..

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Ycp Mp Vijayasai Reddy)ని జైలుకు పంపే వరకూ వదలిపెట్టనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న(TDP MLC Buddha Venkanna) హెచ్చరించారు. కాకినాడ సీ పోర్టు వివాదం(Kakinada sea port dispute)లో వచ్చిన ఆరోపణలపై మాట్లాడుతూ సీఎం చంద్రబాబు(CM Chandrababu)పై విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. విజయసాయిరెడ్డికి మానవ విలువలు తెలియవని విమర్శించారు. చంద్రబాబుకు కుల పిచ్చి ఉందని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు బుద్దా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్‌కు, విజయసాయిరెడ్డికి కుల పిచ్చి ఉందేమోగాని, చంద్రబాబుకు లేదని తెలిపారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ కేసులు వేస్తానని చెప్పారు. జగన్ హయాంలో వ్యాపార వేత్తలను భయపెట్టి ఆస్తులు రాయించుకున్నారని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.






