- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే సంచలన సవాల్
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో నిన్న(గురువారం) మాట్లాడిన వ్యాఖ్యలపై టీడీపీ నేడు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో నిన్న(గురువారం) మాట్లాడిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. ఇవాళ(శుక్రవారం) నెల్లూరు మినీ మహానాడులో ఎమ్మెల్యే సోమిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మరీ పచ్చి అబద్ధాలని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి పై ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని సోమిరెడ్డి తెలిపారు. ఉర్సాకు రూపాయికే భూమి కట్టబెట్టామని వైఎస్ జగన్ ఆరోపిస్తున్నారు.. రూపాయికే ఇచ్చామని జగన్ నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే అబద్ధాలు ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.
గత వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం దేశంలోనే అతిపెద్దది. మద్యపాన నిషేధం పేరుతో కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలు తీశారని సోమిరెడ్డి ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం మద్యాన్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులకు నేడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం వడ్డీలు కడుతోందని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.






