Tdp: ఎండలో నిలబడి వినూత్న నిరసన

by Disha Web |
Tdp: ఎండలో నిలబడి వినూత్న నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్టీఆర్ టిడ్కో ఇళ్ళకు నాలుగేళ్లుగా తాళాలు ఎందుకు వేశారంటూ టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. అసెంబ్లీ బయట ఎండలో నిలబడి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. కట్టిన ఇళ్లకు రంగులు కాదని, మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నాడు ఉచితమని చెప్పి, నేడు టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులను బ్యాంకులకు జగన్ తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. నాలుగేళ్లలో ఒక్క అరబస్తా సిమెంట్ వాడకుండా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులపై జగన్ కక్ష సాధిస్తున్నాడని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.



Next Story