మెగాస్టార్ చిరంజీవిని కలిసిన TDP ఎమ్మెల్యే

by Gantepaka Srikanth |

అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు.

మెగాస్టార్ చిరంజీవిని కలిసిన TDP ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)ని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. శుక్రవారం చిరంజీవి నటిస్తున్న 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా షూటింగ్ సెట్‌లో మర్యాదపూర్వంగా భేటీ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ట్వీట్ పెట్టారు. ‘‘అన్నయ్య నటన నిత్య నూతనం. ప్రతి సినిమాకి ఆయనలోని ప్రతిభ కొత్త పుంతలు తొక్కుతుంది. సంక్రాంతికి రెడీ అవుతున్న "మన శంకర వరప్రసాద్ గారు" సినిమా కోసం యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్ లో యువ హీరోలకు పోటీ ఇవ్వబోతున్నారు. సినీ ప్రపంచాన్ని ఉర్రూత లూగించే స్టెప్పులతో వారెవ్వా మెగాస్టార్ అనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ షూటింగ్ స్పాట్‌లో అన్నయ్యను కలిసి.. ఆల్ ద బెస్ట్ చెప్పాను’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ట్వీట్

Next Story