ఆ ఇద్దరి మృతికి ఆయనదే బాధ్యత: ఎమ్మెల్యే కన్నా

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-19 05:51:27  IST  )

రెంటపాళ్ల ర్యాలీలో మృతి చెందిన ఇద్దరు వైసీపీ కార్యకర్తల బాధ్యతను జగన్ తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు..

ఆ ఇద్దరి మృతికి ఆయనదే బాధ్యత: ఎమ్మెల్యే కన్నా
X

దిశ, వెబ్ డెస్క్: ‘వైసీపీ అధినేత జగన్(Ycp Chief Jagan) పర్యటన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. జగన్ కాన్వాయ్ తగిలి ఒకరు చనిపోగా.. ఎండలో ర్యాలీ తీసి మరొకరు మృతి చెందారు. వైసీపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటేనే రెంటపాళ్ల(Rentapalla)లో విగ్రహం ఆవిష్కరించిన జగన్.. మరి ఆయన పర్యటనలో ఇద్దరు మృతి చెందితే పట్టించుకోరా.’ అని టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. సింగయ్య, జయవర్దన్ రెడ్డి మృతికి జగనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో తాము ర్యాలీలకు పిలుపునిస్తే టీడీపీ నేతలను గృహ నిర్బంధాలు చేశారని గుర్తు చేశారు. అప్పటి రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటలను కూడా అడ్డుకున్నారని మండిపడ్డారు. మూడు వాహనాలు, వంద మందితో వెళ్లాలని పోలీసులు చెప్పినా.. భారీగా వెళ్లి అరాచకం సృష్టించారని ఆరోపించారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులను కూడా పక్కకు నెట్టేశారని కన్నా ఆరోపించారు.

Next Story