- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వందల కోట్లు దోచిపెడుతున్నారు: ఎమ్మెల్యే గోరంట్ల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల భయంతో బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు...

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసుల భయంతో బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటున్నారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఎక్కడ జైలుకు పంపిస్తారోనన్న భయంతో బీజేపీ ముందు మోకరిళ్లుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజమహేంద్రవరం తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తనకు ఛానెల్స్, పత్రికలు లేవంటూనే ఇతర పత్రికలు, టీవీ చానల్స్‌పై దాడి చేయిస్తున్నాడని ఆరోపించారు. వందల కోట్లు ప్రజాధనాన్ని సీఎం జగన్ తన సొంత పత్రిక, ఛానెల్‌కు దోచి పెడుతున్నాడని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. వైఎస్ జగన్ అరాచక పాలనతో అభివృద్ధి కుంటుపడిందని ధ్వజమెత్తారు. అభివృద్ధి లేకపోగా అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఇకపోతే జగన్ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో పెట్రేగిపోతున్నారని ధ్వజమెత్తారు. జగన్ పేటీఎం బ్యాచ్‍తో అందర్నీ తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం గోదావరి తీరంలో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు.






