టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గన్‌మెన్ సస్పెండ్

by Ajay Maddhiboyina |

అనంత‌పురం అర్బ‌న్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్ర‌సాద్ వివాదంలో చిక్కుకున్నారు. న‌గ‌రంలో న‌య‌గారా ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేక‌గా ఆ నిర్వాహ‌కుడిపై దాడి చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది.

టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గన్‌మెన్ సస్పెండ్
X

దిశ, వెబ్ డెస్క్: అనంత‌పురం అర్బ‌న్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్ర‌సాద్ వివాదంలో చిక్కుకున్నారు. న‌గ‌రంలో న‌య‌గారా ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేక‌గా ఆ నిర్వాహ‌కుడిపై దాడి చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. ఎగ్జిబిష‌న్ నిర్వాహ‌కుడిని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. మ‌ద్యం పేవించి ఎమ్మెల్యే ముఖ్య అనుచ‌రుడు గంగారాం, గ‌న్ మెన్ వీరంగం సృష్టించార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా త‌న‌ను రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని బెదిరించారని ఆరోపించారు. ఎమ్మెల్యే అనుచ‌రులు అనిచెప్పుకుంటూ డ‌బ్బులు డిమాండ్ చేశార‌న్నారు.

దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ జ‌రిపారు. ఎమ్మెల్యే ద‌గ్గుబాటి ప్ర‌సాద్ గ‌న్ మెన్ ను స‌స్పెండ్ చేశారు. ఎస్పీ ఆదేశాలు లేకుండా జిల్లా వ‌దిలి వెళ్ల‌రాద‌ని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే అప్పట్లో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఓ ఆడియో వైరల్ అయింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు దగ్గుబాటి ఇంటి వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పుడుు ఆయన మరో వివాదంలో చిక్కుకోవడంతో నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

Next Story