- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నేనే దగ్గరుండి పవన్ ‘OG’కి ఏ సమస్య లేకుండా చూస్తా’.. టీడీపీ ఎమ్మెల్యే కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఓజీ సినిమా(OG Movie) విడుదలకు రంగం సిద్ధం అయింది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ఓజీ సినిమా(OG Movie) విడుదలకు రంగం సిద్ధం అయింది. ప్రపంప వ్యాప్తంగా మూడు భాషల్లో సెప్టెంబర్ 25వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌తో పాటు చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతూ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్(TDP MLA Daggubati Prasad) కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. ‘‘ఈరోజు విడుదల అయ్యే మన పవన్ కల్యాణ్ ఓజీ సినిమాకి నా హృదయపూర్వక అభినందనలు.. మంచి మనసున్న మనిషి, అంధకార సమయంలో మా పార్టీకి అండగా నిలిచి అచంచలమైన మద్దతు ఇచ్చారు.. మేము కూడా ఆయన కోసం ఎప్పటికీ నిలబడతాం.. అనంతపురలో నేనే దగ్గర ఉండి ఎలాంటి సమస్యలు లేకుండా ఓజీ సినిమా విడుదల అయ్యేలా చూస్తా’’ అని కీలక ప్రకటన చేశారు. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, తమన్ సంగీతం అందించారు. శ్రియారెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటించారు.






