TDP: హిటాచీ ఇండియా ఎండీతో మంత్రి నారా లోకేష్ భేటీ.. కీలక విషయాలు వెల్లడి

by Ramesh Goud |

ఇన్‌వెస్ట్ ఏపీ(Invest AP) లక్ష్యంతో దావోస్(Davos) వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) బృందం ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

TDP: హిటాచీ ఇండియా ఎండీతో మంత్రి నారా లోకేష్ భేటీ.. కీలక విషయాలు వెల్లడి
X

దిశ, వెబ్ డెస్క్: ఇన్‌వెస్ట్ ఏపీ(Invest AP) లక్ష్యంతో దావోస్(Davos) వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) బృందం ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(World Econamic Forum) సదస్సులో పాల్గొంటూ.. ఏపీలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తు్న్నారు. ఇందులో భాగంగానే మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ప్రముఖ పారిశ్రామిక వేత్త, హిటాచీ ఇండియా(Hitachi india) ఎండీ భరత్ కౌశల్(Bharath Koushal) తో దావోస్ బెల్వెడేర్ లో భేటీ అయ్యారు.

ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సమావేశంలో సమర్థవంతమైన పవర్ ట్రాన్స్ మిషన్ కోసం రాష్ట్రంలో హెచ్‌వీడీసీ వంటి అధునాతన సాంకేతికతలను అమలు చేయడంలో సహకరించాలని భరత్ కౌశల్ ను కోరారు. రాష్ట్రంలో 3 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ల (కడప, అనంతపురం, తాడేపల్లిగూడెం) ఏర్పాటుకు సంబంధించి గత ప్రణాళికలను పునఃపరిశీలించాలని, వాటిని గ్రౌండింగ్ చేసే కార్యక్రమాలను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక కంపెనీ సహచరులతో చర్చించి ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ద్వారా పబ్లిక్ సర్వీస్ డెలివరీని మెరుగుపరిచే సిస్టమ్‌లను హిటాచీ అభివృద్ధి చేస్తోందని మంత్రికి భరత్ కౌశల్ వివరించారు.

Next Story