- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TDP Mahanadu : టీడీపీ మహానాడు తేదీల ఖరారు
తెలుగుదేశం పార్టీ(TDP) ప్రతిఏటా ఘనంగా నిర్వహించే మహానాడు(Mahanadu)కు తేదీలు ఖరారయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీ(TDP) ప్రతిఏటా ఘనంగా నిర్వహించే మహానాడు(Mahanadu)కు తేదీలు ఖరారయ్యాయి. టీడీపీ మహానాడు ఈ ఏడాది కడప(Kadapa) జిల్లాలో మే 27, 28, 29 తేదీల్లో జరపబోతోంది. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహానాడు ఏర్పాట్లపై మంత్రి అచ్చన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ మహానాడు కడపలో చింతకొమ్మదిన్నె మండలం, పబ్బాపురం దగ్గర కర్నూల్-రాయచోటి రోడ్డులో జరుగుతుందన్నారు. మే 27, 28న పలు తీర్మానాలు పాస్ చేస్తామని, మే 29న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు.
కాగా సభా వేదిక నిర్మాణం కోసం మే 7న భూమి పూజ చేసే కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటారని తెలిపారు. అయితే మహానాడు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఎన్.టి. రామారావు పుట్టినరోజు(మే 28)న జరుపుతారు. ఈసారి మాత్రం కడపలో బలమైన శక్తిగా ఉన్న వైసీపీకి టీడీపీ తమ బలాన్ని చూపించుకోడానికి ఒక అవకాశంగా మహానాడు కార్యక్రమాన్ని అక్కడ జరపబోతున్నట్టు తెలుస్తోంది.






