‘అమ్మఒడిని ఒకసారి ఎగ్గొట్టారు’.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ(YSRCP) చేస్తోన్న విమర్శలను టీడీపీ నేత పట్టాభి రామ్ తిప్పికొట్టారు

‘అమ్మఒడిని ఒకసారి ఎగ్గొట్టారు’.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ(YSRCP) చేస్తోన్న విమర్శలను టీడీపీ నేత పట్టాభి రామ్ తిప్పికొట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తున్నారని పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఈ తరుణంలో గత ప్రభుత్వం పై టీడీపీ నేత పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడిని ఒకసారి ఎగ్గొట్టిందని, కోతలు పెట్టుకుంటూ అమలు చేసిందని ఆయన విమర్శించారు.

టాయిలెట్ల నిర్వహణ పేరుతో రూ.2,178 కోట్లకు కోత పెట్టారని ఆరోపించారు. ఆ కట్ చేసిన డబ్బులు ఎక్కడికెళ్లాయో తెలియదని పట్టాభి రామ్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చివరిసారిగా 42.61 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చిందని, తమ ప్రభుత్వం 67.27 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం(Talliki Vandanam) ఇస్తోందని ఆయన వివరించారు. ఏపీ(Andhra Pradesh)లో సీఎం చంద్రబాబు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ, సంస్కరణలు తీసుకొచ్చారని టీడీపీ నేత పట్టాభి వెల్లడించారు.

Next Story