'వై నాట్ 175' అంటున్న టీడీపీ నేతలు

by Muthe.Rajitha |

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ 175 సీట్లు సాధిస్తుందనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలు 'వై నాట్ 175' అంటున్నారు.

వై నాట్ 175 అంటున్న టీడీపీ నేతలు
X

దిశ వెబ్ డెస్క్ : వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ 175 సీట్లు సాధిస్తుందనే ఉద్దేశంతో ఆ పార్టీ నేతలు 'వై నాట్ 175' అంటున్నారు. నేడు విడుదలైన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన అనంతరం మంత్రి పార్థ సారథి మీడియాతో మాట్లాడారు. వై నాట్ పులివెందుల, వై నాట్ 175 అని మేము అనడం లేదు గాని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులతో సహా రాష్ట్రంలో మొత్తం సీట్లు కూటమి ఖాతాలోనే ఉంటాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో 175 సీట్లు గెలవడమే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు.

పులివెందులలో వైసీపీ నిర్లక్ష్యం, ముఖ్యంగా వివేకా హత్య కేసులో వైసీపీ నాయకులపై CBI ఆరోపణల కారణంగా ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. అలాగే, ZPTC ఉప ఎన్నికలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను తప్పుడు ఆరోపణలుగా కొట్టిపారేశారు.

Next Story