ఆ రోజుని గుర్తు చేసుకున్న టీడీపీ నేతలు!

by Thanuru Gopichand |

రెండేళ్ల కిందట సరిగ్గా ఈరోజు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కేసులో అరెస్టు చేశారు.

ఆ రోజుని గుర్తు చేసుకున్న టీడీపీ నేతలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో : రెండేళ్ల కిందట సరిగ్గా ఈరోజు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కేసులో అరెస్టు చేశారు. ఆ రోజును ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటూ ట్విట్టర్లో పోస్ట్​లు పెడుతున్నారు.. 'ప్రతి తెలుగు వాడు తల్లడిల్లిన రోజు.. ఓ నియంత, వ్య వస్థలను చెరబట్టి, అహంకారంతో అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి, రాక్షస ఆనందం పొందిన రోజు.. కానీ వారికి ఆ రోజుకి తెలియదు, నిజాయితీని నిర్బంధిస్తే ఏమవుతుందని..! చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కి నిర సనగా పౌర సమాజం భగ్గుమంది. మహిళా లోకం కదం తొక్కింది. యువత తిరగబడింది. చంద్రబాబు గారికి మద్దతుగా హైదరాబాద్ తో పాటు 70 దేశాలలోని తెలుగు ప్రజలు ఉద్యమించారు. నియంత జగన్‌పై జనం శాంతియుతంగా పోరాడారు. ప్రజలు నిజాన్ని గెలిపించారు. చంద్రబాబు గారిని ప్రజా హృదయ విజేతగా నిలిపారు..' అంటూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ఇదే విధంగా టీడీపీ నేతలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఆ రోజును గుర్తు చేసుకుం టున్నారు. తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్​హ్యాండిల్​లో చంద్రబాబు ఫొటోను పోస్టు చేసింది.

https://x.com/JaiTDP/status/1965259776595464362?t=NYxfvHqiPDZqEpSk5I5n6A&s=19

Next Story