బుకాయింపు రాజకీయాలకు శ్రీకారం.. జగన్‌కు మాస్ వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-21 13:24:49  IST  )

ఏపీలో వైసీపీ నేతలు బుకాయింపు రాజకీయాలు చేస్తున్నారంటే టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు..

బుకాయింపు రాజకీయాలకు శ్రీకారం.. జగన్‌కు మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో బుకాయింపు రాజకీయాలకు వైసీపీ నేతలు తెర తీశారు. గత ఐదేళ్లలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునే క్రమంలో పసలేని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో టీడీపీ(Tdp) నాయకులు సెటైర్లు వేస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో జరిగిన తప్పులను వెతికి మరీ విమర్శిస్తున్నారు. వైసీపీ(Ycp) అధినేత వైఎస్ జగన్(Ys Jagan) సైతం బుకాయింపు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.


జగన్‌పై తాజాగా మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra), ఎంపీ కేశినేని చిన్ని(Mp Kesineni Chinni) ఫైర్ అయ్యారు. స్కాములతో జగన్ ఏపీ పరువు తీసిన వ్యక్తి అని కొల్లు రవీంద్ర ఆరోపించారు. గత ఐదేళ్లలో జరిగిన స్కాములన్నీ బయటకు వస్తుండటంతో వైఎస్ జగన్ బుకాయింపు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అధికారులను మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ చేసిన పోరాటం వల్లే ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి శిక్షపడిందని కొల్లు వ్యాఖ్యానించారు.


ప్రజా ప్రతినిధిగా ఉన్న జగన్ ప్రతీ మాట వెనుక హుందాతనం ఉండాలని ఎంపీ కేశినేని చిన్ని సూచించారు. రౌడీల భాషను తలపించేలా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయని చెప్పారు. గత ముఖ్యమంత్రి 2.0 కాదని, 4.0 చూపించుకున్నా తాము భయపడమని చిన్ని వార్నింగ్ ఇచ్చారు.

Next Story