- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
AP News:పవన్ కళ్యాణ్, లోకేష్ ర్యాంకులపై మాజీ మంత్రి సెటైర్.. స్పందించిన టీడీపీ నేత

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో(Andhra Pradesh) టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న(గురువారం) సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం(Cabinet Meeting) జరిగింది. ఈ కేబినెట్ భేటీలో మంత్రుల ర్యాంకింగ్స్‌ను సీఎం చంద్రబాబు(CM Chandrababu) ప్రకటించారు. డిసెంబర్ వరకు దస్త్రాల క్లియరెన్స్ ఆధారంగా రాష్ట్ర మంత్రులకు ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది.
ఈ జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు 6వ స్థానం, ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) 8వ స్థానం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) 10వ స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ర్యాంక్స్‌పై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former Minister Ambati Rambabu) సెటైరికల్ గా ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ‘ర్యాంకు’ రాజకీయం నడుస్తోంది. మంత్రుల ర్యాంకుల్లో 8, 9 స్థానాలు వచ్చిన మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అభినందనలు’ అంటూ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఈ క్రమంలో అంబటి రాంబాబు ట్వీట్‌కు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న(Buddha Venkanna) కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్(Former CM Jagan) 2.O వ్యాఖ్యలపై బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. మొన్న 175 అన్నావ్.. ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది. ఇప్పుడెమో 2.0 అంటున్నారని టీడీపీ నేత(TDP Leader) బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో ‘‘అయ్యా అంబటి 8, 9 స్థానాల్లో వచ్చిన వారిద్దరూ 1, 2 స్థానాల్లోకి రావడానికి కృషి చేస్తున్నారు. అలాగే 11 స్థానాల్లో ఉన్న మీ జగన్ కూడా వచ్చే ఎన్నికల్లో ఒక్క స్థానాల్లోకి రావడానికి మరింత కృషి చేస్తున్నాడు’’ అని సెటైర్ వేశారు.