మాన‌వ‌త్వం ఇంకా బ‌తికే ఉంది: కోవా బన్ వ్యాపారికి మద్దతుగా పరిటాల శ్రీరామ్ ట్వీట్

by Vemula.Srinu Prasad |

తెలంగాణలో సమ్మక్క, సారక్క జాతరలో కోవా బన్ అమ్ముకునే వ్యాపారిపట్ల యూట్యూబ్ చానల్ జర్నలిస్ట్ ప్రవర్తించిన తీరుపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ స్పందిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు..

మాన‌వ‌త్వం ఇంకా బ‌తికే ఉంది: కోవా బన్ వ్యాపారికి మద్దతుగా పరిటాల శ్రీరామ్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సమ్మక్క, సారక్క జాతర(Sammakka, Sarakka fair)లో కోవా బన్(Koa Bun) అమ్ముకునే వ్యాపారిపట్ల యూట్యూబ్ చానల్ జర్నలిస్ట్(YouTube channel journalist)ప్రవర్తించిన తీరుపై లోకం మొత్తం దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు. ‘‘ఆక‌లికి కులం ఉండ‌దు. ఆత్మగౌర‌వానికి మ‌తం ఉండ‌దు. క‌ష్టప‌డి ప‌నిచేసుకొని కుటుంబాన్ని పోషించుకునే ప్రతీ ఒక్కరినీ గౌర‌వించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది. ఒక కోవ బ‌న్ విక్రయించుకునే పేద చిరు వ్యాపారి జీవితాన్ని ఇలా రోడ్డుపైకి లాగ‌డం దారుణం. యూట్యూబ్‌లో వ్యూస్, లైక్స్ కోసం కొంద‌రు ఇలాంటి ప‌నులు చేస్తున్నారు. వీలైతే పేద వారి ప‌క్షాన నిల‌బ‌డాలి కానీ ఇలా గొంతు నొక్కడం స‌రైంది కాదు. ఆ చిరు వ్యాపారికి మ‌ద్దతుగా నిలుస్తూ ఈ సంఘ‌ట‌న‌ను ఖండిస్తున్న ప్రతీ ఒక్కరికీ నా ధ‌న్యవాదాలు. సోష‌ల్ మీడియాలో ఆ వ్యాపారికి ల‌భిస్తున్న మ‌ద్దతు చూస్తుంటే మాన‌వ‌త్వం ఇంకా బ‌తికుంద‌న్న భావ‌న క‌లుగుతోంది.’’ అని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు.

పరిటాల శ్రీరామ్ ట్వీట్..

Next Story