- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదవి లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నా.. బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు
విజయవాడలో జరిగిన సీఐల బదిలీల విషయంలో ఎమ్మె్ల్యేల మాట నెగ్గిందని, తన మాట చెల్లలేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న అసహనం వ్యక్తం చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో జరిగిన సీఐల బదిలీల విషయంలో ఎమ్మె్ల్యేల మాట నెగ్గిందని, తన మాట చెల్లలేదని టీడీపీ నేత బుద్దా వెంకన్న అసహనం వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని చిన్ని పుట్టిన రోజు వేడుకల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ పదవి లేకపోవడంతో తాను ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వంపై చాలా పోరాటాలు చేశామని, తనపై 37 కేసులు పెట్టారని గుర్తు చేశారు. అయినా తనకు ఎమ్మెల్యే టికెట్ల దక్కలేదని, కానీ తాను ఫీల్ కాలేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తనకు న్యాయం జరగడం లేదని వాపోయారు. వ్యతిరేకంతో చెబుతున్న మాటలు కావని, ఆవేదన అంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదనను సీఎం చంద్రబాబు దృష్టికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తీసుకెళ్లాలని బుద్దా వెంకన్న కోరారు.
Next Story






