- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులివెందులలో హైటెన్షన్.. టీడీపీ నేత బీటెక్ రవి సంచలన సవాల్
పులివెందులలో నెలకొన్న పరిస్థితులపై టీడీపీ నేత బీటెక్ రవి స్పందించారు....

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక ప్రచారంలో ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థి సురేశ్ తో పాటు వైసీపీ ఎమ్మెల్సీ రమేశ్ కారుపై దాడులు జరిగాయి. అయితే ఈ దాడులు టీడీపీ నేతలు చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పులివెందులలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా టీడీపీ శ్రేణులు గొడవ చేసి తమ వాళ్లపై దాడులు చేశారని పలువురు వైసీపీ నేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత బీటెక్ రవి స్పందించారు. తాము చేసినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. జగన్ సొంత మీడియాతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కనంపల్లె, కొత్తపల్లె ప్రచారానికి వైసీపీకి అనుమతి ఉందని, నల్లగొండువారిపల్లెలో టీడీపీ ప్రచారానికి పోలీసులు అనుమతి ఇచ్చారని తెలిపారు. వైసీపీ నేత వేల్పుల రాము టీడీపీ ఏజెంట్ల దగ్గరికి వచ్చి ప్రలోభాలతో ఒత్తిడి చేశారని ఆరోపించారు. దీంతోనే పరస్పరదాడులు జరిగాయని, టీడీపీ కార్యకర్తను వేల్పుల రాము కులం పేరుతో దూషించారని చెప్పారు. తమ అధినేతపై ఇస్టానుసారం మాట్లాడితే ఉపేక్షించమని బీటెక్ రవి హెచ్చరించారు.






