- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పులివెందుల్లో పొలిటికల్ హీట్.. జగన్‌కు బీటెక్ రవి మరోసారి సంచలన సవాల్
వైఎస్ జగన్‌కు టీడీపీ నేత బీటెక్ రవి మరోసారి సవాల్ విసిరారు..

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న విషయం తెలిసిందే. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో టీడీపీ నేత బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి. పులివెందుల ఎన్నికల్లో టీడీపీ నేతలు దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడి గెలిచారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. అవసరమైతే మళ్లీ తాము పోటీకి సిద్ధమంటున్నారు టీడీపీ నేతలు.
దీంతో పులివెందుల(Pulivendula)లో రాజకీయ వేడి కొనసాగుతోంది. తాజాగా వైసీపీ(Ycp) నేతలు విసిరిన సవాల్‌ను టీడీపీ నేత బీటెక్ రవి(Tdp Leader Btech Ravi) స్వీకరించారు. అసెంబ్లీ(Assembly)కి రాని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy)కి పులివెందుల ఎమ్మెల్యే పదవి అనవసరమని మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తే తన సతీమణి మారెడ్డి లతా రెడ్డి(Mareddy Lathareddy) జడ్పీటీసీకి రాజీనామా చేస్తుందని తెలిపారు. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యే, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిద్దామన్నారు. కేంద్రబలగాల సాయంతో 2 ఉపఎన్నికల్లో ఎవరు ఏంటో తేల్చుకుందామని బీటెక్ రవి చాలెంజ్ చేశారు.






