- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజీనామా చేసి ఎన్నికలకు రా..? : జగన్‌కు బీటెక్ రవి ఓపెన్ ఛాలెంజ్
పులవెందులలో రాజీనామా చేసి ఎన్నికలకు రా జగన్ అంటూ టీడీపీ నేత బీటెక్ రవి ఛాలెంజ్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: పులివెందుల(Pulivendula)లో రిగ్గింగ్, దౌర్జన్యాలకు పాల్పడి టీడీపీ(Tdp) గెలిచిందని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు టీడీపీ నేత బీటెక్ రవి(Btech Ravi) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో తాను 60 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాయనని, తాను కూడా వాళ్ల లాగే చౌకబారు ఆరోపణలు చేయాలా అని ప్రశ్నించారు. అప్పుడు కూడా దౌర్జన్యాలు, అరాచకాలు చేసి జగన్ గెలిచారని తాను ఆరోపిస్తున్నానని చెప్పారు. మరి ఇప్పుడు జగన్రాజీనామా ఎన్నికలకు వస్తారా బీటెక్ రవి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. జగన్ సిద్ధమనుకుంటే ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
పులివెందుల జడ్పీటీసీ గెలుపుపైనా ఆయన స్పందించారు. పులివెందులలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నికలు జరిగలేదన్నారు. 1995 ఎన్నికలు జరిగాయని.. అప్పటి నుంచి అన్ని సార్లు ఏకగ్రీవం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. పులివెందుల్లో టీడీపీ గెలవడంతో ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమైనట్టు జగన్ మాట్లాడుతున్నారని, పులివెందులలో 33 వార్డులు, ఏడు జడ్పీటీసీలు, 101 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అవుతాయా అని ప్రశ్నించారు. ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఆలోచించాలని సూచించారు. జగన్ దరిద్రం వల్ల నామినేషన్లు కూడా 11 వచ్చాయని ఎద్దేవా చేశారు. 11 సీట్లు 11 నామినేషన్లు, భారీ ఓటమి జగన్‌కు దక్కిందని విమర్శించారు.
‘‘నేను ఇప్పటికీ జగన్‌ను, అవినాశ్‌ను గౌరవించే మాట్లాడతా. కానీ నన్ను మాత్రం అసభ్యంగా మాట్లాడతారు. జగన్‌కు అహంకారం దించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది నాయకులు మాకు చెప్పారు. ఎన్నికల్లో కూడా సహకరిస్తామని చెప్పారు. ఇంకా వైసీపీ కార్యకర్తలు చెప్పిన మాటాలు వింటే జగన్ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. అంతనీచాతినీచంగా, ఘోరంగా జగన్‌ను సొంత కార్యకర్తలే తిడుతున్నారు. ఐదేళ్లు వాళ్లతో పనులు చేయించకుని పావలా బిళ్ల కూడా ఇవ్వలేదని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు తాకట్టు పని చేస్తే రూపాయి కూడా ఇవ్వలేదని, మీకు సహకరిస్తామని వైసీపీ నేతలే చెప్పారు. కానీ వైసీపీ వాళ్లు చెప్పిన మాటలను నేను నమ్మలేదు. ఎన్నికల జరిగిన తర్వాత ఇప్పుడు నమ్ముతున్నాం. నిజంగా జగన్ మోహన్ రెడ్డిపై వైసీపీ వాళ్లకు కసి ఉంది.’’ అని బీటెక్ రవి తెలిపారు.
‘‘పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరగకుండా చేసే దానికి విశ్వ ప్రయత్నం చేశారు. అయినా సరే టీడీపీనే గెలిచింది. అచ్చెవల్లి గ్రామంలో వైసీపీకి నలబై ఓట్లు మాత్రమే పడ్డాయి. ఎన్నికల కేంద్రాల్లో వెబ్ కెమెరాలు, జాయింట్ కలెక్టర్ ఉన్నారు.. దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. వాళ్లకు చేతనైనప్పుడు రౌడీయిజం, దౌర్జన్యం చేశారు. చేతగానితనం ఉన్నప్పుడు ఎన్నికలు బైకాట్ చేశారు.’’ అని టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించారు.






