- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చంద్రబాబు అరెస్ట్ వెనుక ఢిల్లీ పెద్దల పాత్ర: అయ్యన్నపాత్రుడు

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్రప్రభుత్వంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన విరుచుకుపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక ఢిల్లీ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు. అందుకే వాళ్లు మౌనంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. కేంద్రనిధులను సీఎం జగన్ పక్కకు మళ్లిస్తున్నా కనిపించడం లేదా ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను జగన్ భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితులను రాష్ర్టంలో ఎప్పుడూ చూడలేదని అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story