- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ విషయంలో జగన్‌కు మద్దతుగా ఉంటాం.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
ముగ్గురు రౌడీ షీటర్లను పోలీసులు రోడ్డుపై కొడితే జగన్ చంద్రబాబును కూడా కొట్టాలని అంటున్నాడని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam venkataramanareddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ముగ్గురు రౌడీ షీటర్లను పోలీసులు రోడ్డుపై కొడితే జగన్ చంద్రబాబును కూడా కొట్టాలని అంటున్నాడని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam venkataramanareddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు(chandrababu) వాళ్లలా లేనందుకు కొట్టాలా అని ఆనం ప్రశ్నించారు. 31 కేసులు ఉన్న జగన్‌ను ఇప్పుడు దేనితో కొట్టాలని మండిపడ్డారు. 7 ఈడీ కేసులు, 11 సీబీఐ కేసులు ఉన్న జగన్‌ను చెప్పుతో కొట్టాలా అంటూ ఓ రేంజ్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
3452 సార్లు కోర్టులో వాయిదాలు తెచ్చుకున్న ఏకైక హాఫ్ టికెట్ జగన్(jagan) అంటూ ఫైర్ అయ్యారు. అది ప్రపంచ రికార్డు అని అన్నారు. జగన్ మగాడు అయితే కోర్టుకు వెళ్లి ఎలాంటి వాయిదాలు అడగకుండా తన కేసుల తీర్పు ఇవ్వాలని అడగాలన్నారు. కేవలం ఆరు నెలల్లోనే అన్ని కేసుల్లో తీర్పు ఇవ్వాలని కోరాలన్నారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో జగన్‌కు మద్దతుగా ఉంటుందని చెప్పారు. మగాడివైతే రా అంటూ మాజీ సీఎంకు సవాల్ విసిరారు.






