వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే విజయం: MLA బాలకృష్ణ

by Satheesh |   (  Updated:2024-02-28 14:42:00  IST  )

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేన కూటమిదే విజయమని నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జోస్యం చెప్పారు. బుధవారం టీడీపీ-

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిదే విజయం: MLA బాలకృష్ణ
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేన కూటమిదే విజయమని నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జోస్యం చెప్పారు. బుధవారం టీడీపీ-జనసేన తాడేపల్లిగూడెంలో ‘తెలుగు జన జెండా’ పేరుతో ఉమ్మడి బహరంగా సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ.. దివంగత సీఎం, తన తండ్రి ఎన్టీఆర్ ఎన్నో విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలను అధికార పీఠం పైకి ఎక్కించారని అన్నారు. పార్టీ కార్యకర్తలే టీడీపీ బలమని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసం టీడీపీ-జనసేన విజయం అత్యంత అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక, అవినీతి పాలన సాగుతోందని, అవినీతి సీఎం జగన్‌ను ఇంటికి పంపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీడీపీ-జనసేన కూటమి గెలవడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.

Read More..

ఆ పార్టీలో దొంగలున్నారు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Next Story