టీడీపీ ట్రెండ్ ​సెట్టర్​.. టీడీపీ పాలన ఓ బ్రాండ్​ అంబాసిడర్​: Nara Chandrababu Naidu

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-27 07:32:03  IST  )

కడపలో తెలుగు దేశం పార్టీ మహానాడు (TDP Mahanadu 2025) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.

టీడీపీ ట్రెండ్ ​సెట్టర్​.. టీడీపీ పాలన ఓ బ్రాండ్​ అంబాసిడర్​: Nara Chandrababu Naidu
X

దిశ, డైనమిక్​ బ్యూరో: కడపలో తెలుగు దేశం పార్టీ మహానాడు (TDP Mahanadu 2025) కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మహానాడు ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి (CM Chandrababu Naidu) మంత్రులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అందరికీ అభివాదం చేస్తూ సీఎం చంద్రబాబు మహానాడు వేదిక వద్దకు చేరుకున్నారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి.. ఆపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 'నాకు ప్రాణసమానమైన తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం' అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి.. కానీ మహానాడు వంటి కార్యక్రమాలు నిర్వహించి కార్యకర్తల బాగోగులు చర్చించుకునే ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా.. మహానాడు అంటే అదేహోరు.. అదే జోరు అని అన్నారు.

కడపై గడ్డపై జరుగుతున్న ఈ మహానాడులో ఎన్నికలై ఏడాదైనా కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం, ఉద్యేగం కనిపిస్తోందని తెలిపారు. కడపలో దేవునిగడపలో నిర్వహిస్తున్న ఈ మహానాడు చరిత్ర సృష్టించబోతోందన్నారు. ఉమ్మడి కడప జిల్లాలో గత ఎన్నికల్లో మన సత్తా చాటామన్నారు. ఈ సారి మరికొంత కష్టపడితే పదికి పది సీట్లు సాధిస్తామని చెప్పారు. రాయలసీమ ప్రజలు గత ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఇక్కడ మహానాడు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. గత ఎన్నికల్లో 53 శాత ఓట్​షేరింగ్​తో విజయాన్ని సాధించామని అన్నారు. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఈ మహా విజయానికి దోహదం చేశామని తెలిపారు. ఏం ఆశించకుండా ప్రతి గ్రామంలో జెండా మోస్తున్న కార్యకర్తవల్లే ఈ విజయం దక్కిందన్నారు. తెలుగుదేశం జెండా ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుందన్నారు. నాటి ఎన్టీఆర్​ చైతన్యరథం, నేను చేసిన పాదయాత్ర, లోకేశ్​ చేసిన యువగళం పాదయాత్ర పార్టీకి ఎంతో తోడ్పడ్డాయని అన్నారు. మన పసుపు సింహం పీక కోస్తున్నపుడు కూడా జై తెలుగుదేశం అని నినదించారని అన్నారు. ఆశయ సాధన కోసం రాజీలేని పోరాటం చేశారని అన్నారు.

కార్యకర్తల త్యాగాలు వృథాకానివ్వం

'కార్యకర్తల త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నా. మీ త్యాగాలు వృథా కానివ్వం. నేను ఒక సైనికున్ని, నిరంతరం పోరాటం చేస్తా.. నా శక్తి, నా ఆయుధాలు మీరే.. మీరు నేను కలిస్తే ఆకాశమే హద్దుగా ఏ పని అయినా చేస్తాం. ప్రతిపక్షంలో ఉంటే అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం. అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం. ప్రజల హక్కులు, ఆస్తులకు రక్షణ కల్పించాం. భావితరాలకు అవసరమైన పాలసీలను తెచ్చాం. రాజకీయాల్లో విలువలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం. ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజా ప్రయోజనం కోసం మాత్రమే వాడాం ఇది తెలుగు దేశం పార్టీ చిత్తశుద్ధి. అట్టడుగు వర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాం జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్లో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం అయింది. ఈ మహానాడు భవిష్యత్తున ఒక దశ, దిశ నిర్దేశం చేస్తుంది. ప్రతి కార్యకర్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. 2025 కడప మహానాడు ఒక చరిత్ర తిరగరాయడానికి దోహదం చేస్తుంది' అని పేర్కొన్నారు.

ఆలస్యమైనా వారికి శిక్ష తప్పదు

నేరస్తులు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని ఈ మహానాడు సాక్షిగా చెబుతున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం పూర్తి చేసి జలహారతి ద్వారా ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని తెలిపారు. భవిష్యత్​లో వచ్చే గ్రీన్​ఎనర్జీకి నాంది పలుకుతామని అన్నారు. మన సంకల్పం హెల్తీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ అన్నారు. పీ4 ద్వారా ఆర్థిక అసమానతలను తగ్గించేందుకు కృషి చేస్తామన్నారు. రాబేయే పదేళ్లలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామని తెలిపారు. ఓబులాపురం అక్రమ మైనింగ్​పై మనం చేసి ఉద్యమంతో అది నిజమని కోర్టులు కూడా గుర్తించి నిందితులకు శిక్షలు విధించాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అవినీతిని వెలికి తీస్తున్నామని తెలిపారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యత ప్రజలు మనకు ఇచ్చారని అన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడడం ఆలస్యం కావచ్చేమో కాని శిక్ష తప్పదన్నారు.

Next Story