నేడు టీడీపీ ఆవిర్భావ వేడుకలు

by velandi.Saikiran |

తెలుగుదేశం ఏర్పాటై, ఇవాళ్టికి 44 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ తరుణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు.

నేడు టీడీపీ ఆవిర్భావ వేడుకలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు జరగబోతున్నాయి. ఎన్నో చరిత్రలు సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఏర్పాటై, ఇవాళ్టికి 44 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించబోతున్న ఆవిర్భావ వేడుకలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు బడా లీడర్లు పాల్గొంటారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించ‌నున్నారు. ఇక ఈ వేదికను సీఎం చంద్రబాబు నాయుడు, పల్లా శ్రీనివాసరావుతో పాటు 1982 నుంచి పనిచేస్తున్న సీనియర్ కార్యకర్తలు పంచుకోనున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన సీనియర్ కార్యకర్తలను చంద్రబాబు నాయుడు సత్కరించబోతున్నారు.

టీడీపీ పార్టీ ఏర్పాటు నేపథ్యం

తెలుగుదేశం పార్టీ ఎన్నో అఖండ విజయాలను నమోదు చేసుకుంది. ముఖ్యంగా బీసీ వర్గాలను ఏకం చేసి వాళ్ళ అభివృద్ధికి దోహద పడింది. అలాంటి తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29వ తేదీన స్థాపించారు. హైదరాబాద్ లోని రామకృష్ణ స్టూడియోలో అలనాటి సీనియర్ ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో టీడీపీ పార్టీని తీసుకువచ్చారు. అయితే ఈ పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి ప్రభంజనం సృష్టించింది.

Next Story