- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఓటర్ల జాబితాలో అక్రమాలపై టీడీపీ పోరు..రేపు ఢిల్లీకి నేతలు
by Seetharam |
X
దిశ, డైనమిక్ బ్యూరో : ఓటర్ల జాబితాలో అక్రమాలపై టీడీపీ పోరాటం ఢిల్లీకి చేరనుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై పోరాడిన టీడీపీ ఇక ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈనెల 21న ఢిల్లీకి టీడీపీ నేతల బృందం వెళ్ల నుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నేతల బృందం ఫిర్యాదు చేయనుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, బోండా ఉమా, పయ్యావుల కేశవ్‌ల బృందం ఢిల్లీ వెళ్లనుంది. అధికార పార్టీ ఒత్తిడితో ఓటరు లిస్ట్‌లో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలతో సహా టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు.
Advertisement
Next Story