తండ్రి వైఎస్‌కు పట్టిన గతే CM జగన్‌కు పడుతుంది: TDP మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   (  Updated:2022-12-15 03:02:29  IST  )

టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తండ్రి వైఎస్‌కు పట్టిన గతే CM జగన్‌కు పడుతుంది: TDP మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ శంఖరావం బహిరంగా సభలో పాల్గొన్న యరపతినేని మాట్లాడుతూ.. గతంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై అలిపిరిలో బాంబు దాడి జరిగిందని.. ఈ ప్రమాదంలో ఆయన కారు 20 అడుగులు పైకి లేచి కిందపడిన చంద్రబాబు బతికారని.. దీని కారణం ఆయన చేసిన మంచితనమేనని అన్నారు. అలాగే అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి హెలికాప్టర్ ప్రమాదంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడిందో.. అతడి కొడుకు, సీఎం జగన్‌కు అదే పరిస్థితి పడుతుందని గుర్తు పెట్టుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Next Story