TDP: ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయండి.. మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి

by Ramesh Goud |   ( Updated:2025-01-22 07:45:34.0  )
TDP: ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేయండి.. మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్ గ్లోబల్ చైర్మన్ కు మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) విజ్ఞప్తి(Request) చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్(Worid Econamic Forum) సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) బృందం దావోస్(Davos Tour) లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో భేటీ అవుతూ.. ఏపీకి కంపెనీలను ఆహ్వానిస్తున్నారు.

ఈ క్రమంలోనే దావోస్ బెల్వేడేర్ లో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ అసోసియేషన్(World Trade Centers Association) గ్లోబర్ చైర్మన్ జాన్ డ్రూ(Jhon Droo)తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ(Vizag), విజయవాడ(Vijayawada), తిరుపతి(Tirupati) నగరాల్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ల(World Trade Centers)ను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ ఆసియాతో భారత మార్కెట్ ను అనుసంధానించడానికి వీలుగా ఏపీలో ట్రేడ్ హబ్(Trade Hub) ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక దీనిపై జాన్ డ్రూ.. ప్రస్తుతం భారత్ లో 13 డబ్ల్యుటీసీ సెంటర్లు పనిచేస్తుండగా.. 7 నిర్మాణంలో ఉన్నాయని, మరో 9 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అలాగే ఏపీలో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని లోకేష్ కు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story