- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మణిపూర్ అల్లర్లలో చిక్కుకున్న ఆంధ్రులను తీసుకురండి : చంద్రబాబు
by samatah |
మణిపూర్ అల్లర్ల లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను క్షేమంగా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు

X
దిశ, డైనమిక్ బ్యూరో : మణిపూర్ అల్లర్ల లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను క్షేమంగా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు ఆదివారం విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ట్విటర్ వేదికగా కోరారు. మణిపూర్
గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతుంది. మే 3న రాష్ట్రంలో గిరిజనులైన కుకీలు, గిరిజనేతరులైన మేతీల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆయుధాలు చేతబూనిన మూకలు గ్రామాల్లో దాడులకు తెగబడ్డాయి. ఇళ్లకు నిప్పు పెట్టి, షాపులను లూటీ చేశాయి. దీంతో అల్లర్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Next Story






