- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రధాని మోడీ ట్వీట్‌పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..!
చిలకలూరిపేట బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. ...

దిశ, వెబ్ డెస్క్: చిలకలూరిపేట బొప్పూడిలో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి సభ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రధాని మోడీ ఈ సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. ఇప్పటికే ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చారు. అక్కడి నుంచి చిలకలూరిపేటకు బయల్దేరారు. అయితే ఏపీ పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రసంగిస్తానంటూ పేర్కొన్నారు. ఏపీ ప్రజల ఆశీర్వాదాన్ని ఎన్డీఏ కోరుకుంటోందంటూ ట్వీట్‌లో తెలిపారు.
అయితే ప్రధాని మోడీ ట్వీట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ‘ఏపీ ప్రజలు తమకు స్వాగతం పలుకుతున్నారు. ఉమ్మడిగా మనం సరికొత్త మైలురాళ్లను చేరుకుందాం. ఏపీ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధితో కూడిన సమర్థ పరిపాలనకు కూటమి ఆధ్వర్యంలో నాంది పలుకుదాం.’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read More..






