- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chandrababu: నటుడు శరత్ బాబు మృతిపై తీవ్ర విచారం
సినీ నటుడు శరత్ బాబు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు...

X
దిశ,డైనమిక్ బ్యూరో: సినీ నటుడు శరత్ బాబు మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శరత్ బాబు మరణవార్త దిగ్భ్రాంతి కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు భాషల చిత్రాల్లో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన శరత్ బాబు దక్షిణాది ప్రేక్షకులను మెప్పించారని కొనియాడారు. శరత్ బాబు మృతి సినీ రంగానికి తీరని లోటు అని చంద్రబాబు పేర్కొన్నారు. శరత్‌బాబు ఆత్మకు శాంతి కలగాలని..ఆయన మృతి పట్ల చంద్రబాబు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
కాగా కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో శరత్ బాబు చికిత్స పొందుతున్నారు. అయితే సోమవారం మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవ్వడంతో కన్నుమూశారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు శరత్ బాబు మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
Next Story






