- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారిని భక్తులకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా?
తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గదుల అద్దెల పెంపుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గదుల అద్దెల పెంపుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. గదుల అద్దె భారీగా పెంచడంపై మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. 'తిరుమల కొండను భక్తులకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా అని నిలదీశారు. 'పదే పదే గదుల అద్దెలు ఎందుకు పెరుగుతున్నాయి? సామాన్యులకు శ్రీవారి దర్శనం ఎందుకు భారంగా మార్చుతున్నారు? అద్దెలు 1100 శాతం పెంచడం వెనుక మీ ఉద్దేశ్యం ఏంటి? కలియుగ వైకుంఠం విషయంలో అహంకారం వద్దు.. భక్తుల మనోభావాలు గుర్తించండి' అంటూ చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
తిరుమల కొండను భక్తులకు దూరం చెయ్యాలి అనుకుంటున్నారా..పదే పదే గదుల అద్దెలు ఎందుకు పెరుగుతున్నాయి? సామాన్యులకు శ్రీవారి దర్శనం ఎందుకు భారంగా మార్చుతున్నారు? అద్దెలు 1100 శాతం పెంచడం వెనుక మీ ఉద్దేశ్యం ఏంటి? కలియుగ వైకుంఠం విషయంలో అహంకారం వద్దు...భక్తుల మనోభావాలు గుర్తించండి. pic.twitter.com/bCg9ozkmOu
— N Chandrababu Naidu (@ncbn) January 12, 2023






